- Advertisement -

తిరుమ‌ల‌లో శ్రీ‌వారి భ‌క్తుల ఆగ్ర‌హం

- Advertisement -

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉచిత స్లాట్‌ టోకెన్ల కోసం ఉదయం నుంచే వేలాది మంది భక్తులు బారులు తీరారు. రద్దీని అంచనా వేయడంలో టీటీడీ మేనేజ్‌మెంట్ విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ కౌంటర్లు సరిపడా సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడాన్ని భక్తులు ప్రశ్నించారు. భక్తుల తాకిడి పెరిగితే ముందస్తుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని పోలీసులను నిలదీశారు. ఈ పరిస్థితి తిరుపతి పరువును తీస్తోందంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వీఐపీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, సామాన్య భక్తులకు సరైన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

భారీ రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 2 గంటలకంటే ముందే ఉచిత స్లాట్‌ టోకెన్ల జారీని ప్రారంభించారు. అయినప్పటికీ క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భక్తులను శాంతింపజేసి క్యూలను క్రమబద్ధీకరించారు.

ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -