ఈ ఏడాది రాజాసాబ్‌తో సంక్రాంతి రేసులో వచ్చిన ప్రభాస్…డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు సినిమాలు ఉండగా తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. హను రాఘవపూడితో ఫౌజీ తెరకెక్కుతుండగా ఈ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ప్లాన్ ప్రకారం పూర్తి చేసి, పండుగ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట.
రాజాసాబ్ డిజాస్టర్‌గా మిగలడంతో ఫౌజీ.. కథ, స్క్రీన్‌ప్లే, విజువల్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో నిర్మిస్తోంది. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
