కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న అణచివేతలు, జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారని గుంటూరులో స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న జనాగ్రహానికి నిదర్శనంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన నిలిచింది. రెడ్ బుక్ పాలనకు వ్యతిరేకంగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు.
గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైయస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెంట నడుస్తూ కూటమి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బహిరంగంగా వెల్లడించారు. అణచివేత పాలనకు వ్యతిరేకంగా జనం ప్రవాహంలా కదిలారు.
ఏటుకూరు రోడ్‌కు చేరుకున్న వైయస్ జగన్ గారికి పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ గారి వెంట అడుగులు వేస్తూ, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు స్వరాన్ని వినిపించారు.
చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న దమనకాండలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని ఈ పర్యటన స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న పాలనకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సందేశాన్ని ఈ సంఘటన పంపించింది. గుంటూరులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను సూచిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
