- Advertisement -

పాక్‌కి చుక్కలు చూపించిన నెదర్లాండ్‌

- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026ను పాకిస్తాన్ జట్టు ఉత్కంఠభరిత విజయంతో ఆరంభించింది. కొలంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చివరి వరకు పోరాడినా, చివరికి పాకిస్తాన్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా బౌలింగ్ ఎంచుకుని నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఆరంభంలో నెదర్లాండ్స్ ఓపెనర్లు మైకేల్ లెవిట్, కెప్టెన్ ఎడ్వర్డ్స్ దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో 50 పరుగులు రాబట్టారు. మిడిల్ ఓవర్లలో కూడా స్కోర్ కొనసాగించిన నెదర్లాండ్స్, డెత్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్ సైమ్ అయూబ్ వేగవంతమైన ఆరంభం ఇచ్చాడు. 13 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా 12 పరుగులు చేసి అవుటయ్యాడు. పవర్‌ప్లేలోనే ఇద్దరూ వెనుదిరిగినా పాక్ స్కోర్ 61కు చేరింది.

షాహిబ్‌జాద్ ఫర్హాన్ దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. 31 బంతుల్లో 47 పరుగులు చేసిన ఫర్హాన్ హాఫ్ సెంచరీకి చేరువలోనే అవుటయ్యాడు. వెంటనే ఉస్మాన్ ఖాన్ (0), బాబర్ ఆజామ్ (15) వికెట్లు కోల్పోవడంతో పాకిస్తాన్ ఒత్తిడిలో పడింది. 11 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 19వ ఓవర్‌లో 24 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరికి పాకిస్తాన్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని హై టెన్షన్ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -