- Advertisement -

రేణుదేశాయ్‌కి శ్యామల కౌంటర్!

- Advertisement -

దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన ఆమె, సమాజంలోని సెలబ్రిటీలు, మేధావుల పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించారు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఇటీవల వీధి కుక్కల సంరక్షణ అంశంపై సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, అదే స్థాయిలో గిరిజన పిల్లల సమస్యలపై మాత్రం ఎవరూ మాట్లాడటం లేదని పరోక్షంగా రేణు దేశాయ్‌ని ఉద్దేశించి కామెంట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల అంశం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉడకని ఇడ్లీలు, నిల్వ చట్నీ తినడం వల్ల 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో 70 మందికి రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఒకే బెడ్‌పై నలుగురు–ఐదుగురికి సెలైన్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన ఆహారం, మంచినీరు, వైద్యం లేక గిరిజన ప్రాంతాల్లో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, వందల మంది అనారోగ్యానికి గురయ్యారని ఆమె ఆరోపించారు. అయినా ఈ ఘటనలపై మీడియాలో చర్చ జరగదని, మేధావులు స్పందించరని విమర్శించారు. కుక్కల సంరక్షణపై గొంతెత్తే వారు గిరిజన పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఈ ట్వీట్ పరోక్షంగా సినీ నటి రేణూ దేశాయ్ వ్యాఖ్యలను ఉద్దేశించిందా అనే చర్చ కూడా నడుస్తోంది. కాగా, దేవరపల్లి ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి స్కూల్ వార్డెన్, వంటమనిషిని సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై సమీక్ష నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -