- Advertisement -

భర్తను రూ.1.5 కోట్లకు అమ్మేసిన భార్య!

- Advertisement -

దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి చిత్రాల్లో చూసే కథల మాదిరిగానే భోపాల్‌లో ఒక విస్మయకర ఘటన వెలుగుచూసింది. ఇద్దరు పిల్లల తల్లి తన భర్తను రూ.1.5 కోట్లకు అతని ప్రియురాలికి అప్పగించి, న్యాయస్థానం సాక్షిగా 23 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది.

భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి 23 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఆ వ్యక్తి తన కార్యాలయంలో పనిచేసే 54 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని వారి 16 ఏళ్ల పెద్ద కుమార్తె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కోర్టు భార్యాభర్తలు మరియు ఆ మహిళను కౌన్సెలింగ్‌కు పిలిచింది. ఈ సందర్భంగా భర్త తాను ప్రియురాలితోనే జీవించాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో భార్య తన భర్తను వదిలివేయడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని షరతు పెట్టింది. ప్రియురాలు దీనికి అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం ఆ మహిళ భార్యకు ఒక డూప్లెక్స్ ఇల్లు మరియు రూ.27 లక్షల నగదు చెల్లించింది. దీంతో భార్య తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కొత్త ఇంటికి మారేందుకు సిద్ధమవుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -