టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ సీఎం జగన్. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యుల ప్రవర్తనపై ఘాటుగా స్పందించారు. లోకేష్ తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తాడని ఆరోపించిన జగన్, బాలకృష్ణ వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు. మహిళల గురించి అవమానకరంగా మాట్లాడినప్పటికీ చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నవ్వుతూ ఉండటం సరైంది కాదని విమర్శించారు.
అదే సమయంలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పై డ్రగ్స్ ఆరోపణలను ప్రస్తావించారు. దేశ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్ అని జగన్ ఆరోపించారు. ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.
ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక నాయకుడికి ఉండాల్సిన నైతిక విలువలు చంద్రబాబులో కనిపించడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితులు అన్నీ ఆయన అనుసరిస్తున్న విధానాల ఫలితమేనని పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
