- Advertisement -

డ్రమ్ము సిద్ధం చేశా..ప్రియుడికి భార్య మెస్సేజ్..భర్తకు తెలిసి!

- Advertisement -

సిమెంట్ డ్రమ్ము సిద్ధం చేశాను నీదే ఆలస్యం అంటూ ప్రియుడికి భార్య చేసిన మెసేజ్ చూసి భయంతో ఆమెను ప్రియుడి వద్దకు సాగనంపాడు ఓ భర్త. యూపీ రాష్ట్రంలోని బులంద్‌షహర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఓ మహిళను వివాహం చేసుకుని ఆరు నెలల కొడుకుతో కలిసి నివాసముంటున్నారు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఇటీవల అతని భార్య ప్రియుడితో మాట్లాడుతుండడం గమనించి నిలదీయగా, తనకు ప్రియుడు ఉన్నాడని అతనితో వెళ్లిపోతానని తెగేసి చెప్పింది భార్య.

భార్య ఫోన్ పరిశీలించగా నగ్న ఫోటోలతో పాటు, సిమెంట్ డ్రమ్ము మెసేజ్ చూసి భయపడి పోలీసులను ఆశ్రయించాడు భర్త. ఏం చేద్దామని పోలీసులు ప్రశ్నించగా, నేను ఇంకొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నాను, ఈమెతో కాపురం చేసి సిమెంటు డ్రమ్ములో ముక్కలుగా మారే బదులు ఈమెను వదిలేయడం మేలు అంటూ పోలీసులకు బదులిచ్చాడు రాజ్ కుమార్.

దీంతో భార్యను ప్రియుడి వద్దకు పంపించి, ప్రాణాలతో బయటపడ్డానని పోలీస్ స్టేషన్ నుండి వెళ్లిపోయారు భర్త.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -