- Advertisement -
ఏపీలో అమానుషం చోటు చేసుకుంది. గొర్రెల కాపరులపై విచక్షణారహితంగా దాడి చేశారు సీఎం చంద్రబాబు సామాజికవర్గం నేతలు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంఈదుమూడిలో 5 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పంట లేని భూమిలో గొర్రెలు మేపుతున్నారని ఇనుప రాడ్డుతో దాడి చేశారు. గొల్ల నాకొ**ల్లారా అంటూ.. అమ్మ, అక్కలను అసభ్యకరంగా తిడుతూ దాడికి పాల్పడగా
దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదు పోలీసులు. పైగా తిరిగి బాధితులపైనే కేసులు నమోదుచేశారు.
ఘటనకు సంబంధించి బాధితులు, యాదవ సంఘాలు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. గొర్రెలు మేపేందుకు వెళ్లిన మధుబాబు, అనిల్‌పై గడ్డపారతో దాడి చేయగా అనిల్ భుజం విరిగగా మధుకు గాయాలయ్యాయి. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
