- Advertisement -

భార్యను హత్య చేసి..కూతురిని పొదల్లో పడేశాడు!

- Advertisement -

రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి, ఆమె మృతదేహంతో పాటు చిన్నారి కూతురిని చెట్ల పొదల్లో పడేసిన భర్త దారుణం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దేవునిపల్లి మండలం, రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి రాజు అనే వ్యక్తితో మొదట వివాహం జరిగింది. వీరికి మహేందర్ (7) అనే కుమారుడు ఉన్నాడు. తరువాత కుటుంబ విభేదాల కారణంగా శోభారాణి కోయిలకొండకు చెందిన నర్సింహులు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

ఈ దంపతులకు రెండున్నరేళ్ల మమత అనే కూతురు ఉంది. అయితే నర్సింహులు మద్యానికి బానిస కావడంతో, శోభారాణి తన పిల్లలతో కలిసి గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది.ఇటీవల తన కుమారుడికి సైకిల్ కొనిపెడతానని చెప్పి షాద్‌నగర్‌కు రావాలని నర్సింహులు శోభారాణిని పిలిచాడు. ఆమె పిల్లలతో అక్కడికి వెళ్లినా, అతను రాలేదు. దీంతో తిరిగి ఇంటికి చేరిన శోభారాణి, కుమారుడిని ఇంట్లో వదిలి కూతురితో కోయిలకొండకు బయలుదేరింది.

ఈ సమయంలో నర్సింహులు బైక్‌పై తీసుకెళ్లి, దారుణంగా హత్య చేసి చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేశాడు.మరుసటి రోజు తెల్లవారుజామున చెట్ల పొదల్లో చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూసారు. రక్తపు మడుగులో పడి ఉన్న శోభారాణి మృతదేహం పక్కనే చిన్నారి ఏడుస్తూ కనిపించింది. తల్లికి ఏమైందో తెలియక రాత్రంతా “అమ్మా… అమ్మా…” అంటూ చిన్నారి రోదించడం హృదయాలను కదిలించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, శోభారాణి తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటన మహిళల భద్రతపై, కుటుంబ కలహాల తీవ్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -