- Advertisement -

వారిద్దరికి క్షమాపణలు చెబుతున్నా..!

- Advertisement -

భారత క్రికెట్ మాజీ స్టార్ యువరాజ్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, ధోని మరియు కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన తెలిపారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన యువరాజ్…నేను కపిల్ దేవ్ గారికి, మహేంద్ర సింగ్ ధోనీకి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అన్నారు. తన తండ్రి జోగిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… అది సరైంది కాదు అని నేను నా నాన్నకు చెప్పాను అని వెల్లడించారు.

యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ గతంలో పలువురు క్రికెటర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కపిల్ దేవ్ తనను జట్టులో నుంచి కారణం లేకుండా తప్పించారని ఆరోపించారు.ఒక సందర్భంలో ఆయన్ని చంపాలని అనిపించిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.ధోనీపై కూడా విమర్శలు గుప్పించారు.

యువరాజ్ సింగ్ భారత జట్టులో కీలక ఆటగాడిగా నిలిచారు.2007 టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించగా 2011 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యారు. ఆ సమయంలో సచిన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడారు.

జట్టును విజయవంతంగా నడిపించిన ధోని కారణంగా యువరాజ్‌కు దీర్ఘకాలిక కెప్టెన్సీ అవకాశం రాలేదనే చర్చలు అప్పట్లో సాగాయి. ఈ విషయంపై కూడా ఆయన తండ్రి పలుమార్లు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -