- Advertisement -

ఓటీటీలోకి యంగ్‌హీరో మూవీ!

- Advertisement -

కిరణ్ అబ్బవరం సమర్పణలో సాయితేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 90వ దశకంలోని పల్లెటూరి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 15, 2026 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా గోల్డ్’ (Aha Gold) సబ్‌స్క్రైబర్లు ఈ సినిమాను 24 గంటల ముందే, అంటే మే 14 నుంచే వీక్షించవచ్చు.

1996 కాలంలో తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఊరంతటికీ ఒకటే టీవీ ఉండటం, ఆ టీవీ చుట్టూ అల్లబడిన భావోద్వేగాలు, సరదా సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. ఒకానొక సందర్భంలో ఆ టీవీ మాయం కావడం, ఆ నింద ఒకరిపై పడటం వంటి ఆసక్తికర మలుపులతో ఈ రూరల్ డ్రామాను దర్శకుడు వి. మునిరాజ్ ఆవిష్కరించారు.

కొత్త నటీనటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మించారు.సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె తదితరులు కీలక పాత్రలు పోషించారు.వంశీకాంత్ రేఖానా అందించిన సంగీతం 90ల నాటి అనుభూతిని కలిగిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -