పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక పురోగతి సాధించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
సాంకేతిక ఆధారాలు మరియు నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు యూపీ, బీహార్‌లలో ఆపరేషన్ నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రొఫెషనల్ కిల్లర్లు అయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఈ హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ సువేందు అధికారి …తృణమూల్ కాంగ్రెస్ (TMC)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అరెస్ట్ చేసిన నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై పశ్చిమ బెంగాల్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని విచారించడం ద్వారా ఈ హత్యకు అసలు సూత్రధారులు ఎవరనే విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ముగ్గురు నిందితుల అరెస్ట్‌తో ఈ కేసులో కీలక లింకులు బయటపడతాయని పోలీసులు ఆశిస్తున్నారు.
