- Advertisement -

బాలికపై అత్యాచారం.. వృద్ధుడికి 21 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -

మతిస్థిమితం లేని 12 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు 21 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి 84 ఏళ్లు ఉండటం గమనార్హం.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వూసా వెంకటనారాయణ (84), ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు. 2023 మార్చి నెలలో, తన ఇంటి పక్కన ఉండే మతిస్థిమితం లేని 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి తన ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన తండ్రి, స్థానికుల సహకారంతో నిందితుడిపై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు వెంకటనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టులో విచారించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి పద్మావతి, నిందితుడు వెంకటనారాయణకు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. అలాగే, బాధితురాలికి రూ. 4 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. జిల్లా కోర్టుల అనుసంధాన అధికారి పి. నర్సింహారెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దారుణానికి పాల్పడిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -