- Advertisement -

బండి భగీరధ్‌కు బెయిల్ మంజూరు

- Advertisement -

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్‌కు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసుపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం.. కొన్ని నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను (జామీనుదారులు) సమర్పించాలని హైకోర్టు బండి భగీరధ్‌ను ఆదేశించింది. కోర్టు విచారణకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయకూడదని స్పష్టం చేసింది.

మరో రెండు రోజుల్లో (జులై 11న) బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఉంది. ఈ తరుణంలో ఆయన పుట్టినరోజుకు రెండు రోజుల ముందే కుమారుడు భగీరధ్‌కు బెయిల్ రావడం వారి కుటుంబానికి మరియు రాజకీయ శ్రేణులకు పెద్ద ఊరటనిచ్చింది. బెయిల్ మంజూరు కావడంతో జైలు నుండి భగీరధ్ విడుదల ప్రక్రియ వేగవంతం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -