- Advertisement -

రైలులో శోభనం డెకరేషన్..వైరల్ వీడియో!

- Advertisement -

రైల్వే ప్రయాణాల్లో ప్రయాణికులు విచిత్రమైన పనులు చేస్తూ వార్తల్లో నిలవడం మనం తరచూ చూస్తుంటాం. అయితే తాజాగా ఒక కొత్త జంట ఏకంగా నడుస్తున్న రైలులోనే తమ శోభనం రాత్రి (ఫస్ట్ నైట్) కోసం బెడ్‌రూమ్‌లా డెకరేషన్ చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన రైల్వే అధికారిపై (TTE) అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

బల్లార్ష నుండి ముంబై వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక ఆసక్తికరమైన ఘటనా చోటుచేసుకుంది. ఆ రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ (1st AC) భోగికి చెందిన ఒక ప్రత్యేక కుపేను (రెండు బెర్తులు ఉండే ప్రత్యేక గది) ఒక కొత్త జంట బుక్ చేసుకుంది. అయితే వారు ఆ రైలు గదిని సాధారణ ప్రయాణం కోసం కాకుండా తమ శోభనం వేడుక కోసం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు.

అనుకున్నదే తడవుగా.. ఆ కుపే లోపల రంగురంగుల బెలూన్లు, పూల దండలు, ఎరుపు రంగు లైట్లతో ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గదిని అలంకరించుకున్నట్లుగా అందంగా డెకరేట్ చేసుకున్నారు.ట్రైన్ క్యాబిన్ లోపల జరిగిన ఈ శోభనం డెకరేషన్‌కు సంబంధించిన వీడియోను ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. ఈ వీడియో కాస్తా నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు లోపల ఇలాంటి వ్యక్తిగత కార్యక్రమాలకు అలంకరణలు చేయడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం చట్టవిరుద్ధం.

ఈ వీడియో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే స్పందించారు. రైలు ప్రయాణంలో భద్రతను పర్యవేక్షించాల్సిన మరియు ఇలాంటి అసాధారణ చర్యలను అడ్డుకోవాల్సిన డ్యూటీలో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) తీవ్ర నిర్లక్ష్యం వహించాడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సదరు టీటీఈని రైల్వే అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -