- Advertisement -

అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది..

- Advertisement -

ప్రభాస్ హీరోగా, ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’. గత కొంతకాలంగా ఈ సినిమాపై ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ, చిత్రబృందం తాజాగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

‘అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది..’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ‘1932 నుంచి మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు’ అని రాసి ఉన్న స్టాంప్ సినిమాలోని పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌ను స్పష్టం చేస్తోంది. యుద్ధభూమిలో ఒంటి నిండా రక్తంతో, తుపాకీపై చేయి వేసి ప్రభాస్ కనిపిస్తున్న తీరు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు సుమారు 75 శాతం చిత్రీకరణ పూర్తయిందని, మరో మూడు యాక్షన్ ఘట్టాలతో పాటు కీలక సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. దర్శకుడు హను రాఘవపూడి ‘సీతారామం’ తర్వాత ఈ కథను సిద్ధం చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్నారని, ప్రేక్షకులు తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారని గతంలోనే వెల్లడించారు. త్వరలోనే ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -