- Advertisement -
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే రంగనాథ్‌ను అరెస్ట్ చేయండి అని సూచించింది. ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయండి అని మండిపడింది.
కోర్టు ధిక్కరణ కొనసాగితే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తాం…. అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచాలి అని తెలిఇంది. వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలి అని సూచించింది న్యాయస్థానం.
భూములకు 10 మంది జవాన్లు రక్షణగా ఉండాలి.. హైడ్రా అధికారులు వస్తే అదుపులోకి తీసుకోవాలి అని తెలిపింది. అలాగే హైడ్రా వాహనాలను కూడా సీజ్ చేయాలి అని తెలిపింది హైకోర్టు.
