- Advertisement -

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు గడువు కోరిన కేంద్రం…

- Advertisement -

ఢిల్లీలో హోరెత్తుతున్న నిరసనల వేళ కేంద్రం ఒక మెట్టు దిగింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులు కొందరు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో సమావేశమయ్యారు. నీట్‌ సహా విద్యా వ్యవస్థలో కీలక అంశాలపై చర్చించారు. దాదాపు గంటన్నరపాటు ఈ చర్చలు జరిగాయి. తమ డిమాండ్లను సీజేపీ లిఖితపూర్వకంగా ప్రభుత్వం ముందుంచింది.

నీట్ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత తీసుకోవాలని సీజేపీ నేతలు గట్టిగా డిమాండ్ చేసారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. పేపర్ లీక్ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులపై పెట్టిన ఎఫ్ఐఆర్‌లను ఉపసంహరించాలని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్ర మంత్రులు స్పందింస్తూ తమకు ఒక రోజు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో, రేపు మరోసారి భేటీ అయ్యేందుకు ఇరు వర్గాలు నిర్ణయించాయి. కేంద్రం మంత్రులతో సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టామని సీజేపీ ప్రతినిధి సౌరభ్‌ దాస్ తెలిపారు.

చర్చల్లో భాగంగా కేంద్రం మందు ఉంచిన మూడింట్లో రెండు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉందని అన్నారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని తాము కోరినట్టు చెప్పారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు సంబంధించి రేపటి వరకు కేంద్రం గడువు కోరిందని సౌరభ్‌ దాస్ చెప్పారు. కాగా, చర్చల పైన కేంద్ర మంత్రి నడ్డా స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంపై రేపు(శనివారం) మధ్యాహ్నం మరోసారి వారితో చర్చలు జరుపుతామని అన్నారు. దీంతో.. కేంద్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకరిస్తే.. ఈ వివాదం ముగిసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -