- Advertisement -

కన్న కూతురిపై తండ్రి దారుణం..

- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ కన్న తండ్రి తన పదహారేళ్ల స్వంత కూతురిపైనే రాక్షసంగా ప్రవర్తించాడు. కీచకుడిని మించిన రీతిలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు తండ్రితో పాటు మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు.

ప్రధాన నిందితుడు 2023లో తన భార్యతో విడిపోయాడు. భార్య ముగ్గురు కుమార్తెలను తండ్రి వద్దే వదిలేసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి తన పెద్ద కుమార్తెపై కన్నేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడు. స్వయానా అతడి చెల్లెలి ఇంట్లోనే ఈ అఘాయిత్యం జరిగింది. మేనత్త సహకారంతోనే ఇదంతా సాగింది. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను తీవ్రంగా బెదిరించారు.

ఈ క్రమంలో బాధితురాలికి ఒకసారి బలవంతంగా అబార్షన్ చేయించారు. ఆ తర్వాత బాలిక రెండోసారి కూడా గర్భవతి అయింది. ఈసారి నిందితులు పక్కా ప్లాన్ మార్చారు. బాలికకు వివాహితురాలైన మేజర్‌గా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారు. కొందరు వైద్యసిబ్బంది సహకారంతో ఆమెకు బలవంతంగా ప్రసవం చేయించారు. పుట్టిన మగబిడ్డను ఓ వైద్యుడి సాయంతో ఇతరులకు రహస్యంగా విక్రయించారు.

చివరకు ఈ రాక్షసుల బారి నుంచి బాలిక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎలాగోలా బయటపడింది. జరిగిన దారుణమంతా తన తల్లికి చేరవేసింది. తల్లి, కూతురు ఇద్దరూ కలిసి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కదిలారు. పోక్సో చట్టంతో పాటు వివిధ గమనిక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కామాంధుడైన తండ్రిని, బాలిక మేనత్తను, సహకరించిన వైద్యసిబ్బందిని, బాబును కొనుగోలు చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -