- Advertisement -

ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఐ ఫోన్!

- Advertisement -

మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ 15 కొనివ్వలేదనే కోపంతో కన్న కొడుకు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

సంభాజీనగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు తనకు ఐఫోన్ 15 కొనివ్వాలని తల్లిదండ్రులను పట్టుబట్టాడు. వారు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఖవ్‌ద్యా కొండపైకి వెళ్లి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. తన కోరిక తీర్చకపోతే కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.

సుమారు 3 గంటల పాటు తల్లిదండ్రులు ఎంతగా బతిమిలాడినా ఆ యువకుడు వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో జరిగిన వాగ్వాదంలో అకస్మాత్తుగా తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కిందపడి దుర్మరణం చెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు ప్రాణాలు కోలపోవడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె కూడా అదే కొండపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -