- Advertisement -

మంత్రిగారి భార్య నిర్వాకం

- Advertisement -

ఆవిడ అసలే మంత్రి గారి భార్య. అందులోనూ ఏకంగా విద్యా శాఖ మంత్రి గారి భార్య. ఆమె రాయల్సిన పరీక్ష రాయకుండా పీజీ పట్టా సంపాధించాలనుకుంది. పరీక్ష రాయడానికి తన బదులు మరొకామెను పంపి అడ్డంగా దొరికి పోయింది.

చత్తీస్ గఢ్ విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ భార్య అయినటువంటి శాంతి కశ్యప్ జీ…. సుందర్ లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శాంతి కశ్యప్ తన బదులు సోదరి కిరణ్ మౌర్యను పరీక్షలు రాసేందుకు పంపారు. ఆగస్ట్ 5వతారీఖు ఉదయం 10 గంటలకు శాంతి కశ్యప్ హాల్ టికెట్ తీసుకుని కిరణ్ మౌర్య ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లారు.

పరీక్ష పత్రం తీసుకుని రాస్తుండగా.. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించారు. వారు సెంటర్ ఇంచార్జి హేమరావు ఖర్గేకు చెప్పడంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు వచ్చి కిరణ్ మౌర్యను ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు పంపారు. చత్తీస్ గఢ్ లో ఈ ఘటన దుమారం రేపింది. దీనిపై మంత్రిగారు కానీ ఆయన భార్య గారు కానీ ఇంకా స్పంధించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -