Sunday, May 4, 2025
- Advertisement -

దేశంలో ఎక్కడ… ఎవరికి శిక్షలు పడినా జగన్‌కి ఆపాదించే పచ్చ బ్యాచ్ ఎక్కడ? నోర్లు పడిపోయాయా?

- Advertisement -

జగన్‌ని రాక్షసుడిగా చూపించడ, జగన్ వ్యక్తిత్వాన్ని చంపెయ్యడం, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ జగన్‌ని దూరం చేయడం అన్న లక్ష్యంగా తెలుగునాట జరిగిన దుర్మార్గపు రాజకీయం అంతా ఇంతా కాదు. ఒక్క కోర్టు కూడా జగన్‌ని దోషి అని చెప్పకముందే సమాజం ముందు జగన్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. దేశంలో ఎక్కడ ఎవరికి శిక్ష్లలు పడినా తర్వాత వంతు జగన్‌దే అన్నట్టు మాట్లాడారు. జగన్‌ కూడా ఏదో ఒకరోజు జైలుకు వెళ్ళాల్సిందే అన్నట్టుగా అమానవీయంగా మాట్లాడారు. ఇక ఎల్లో మీడియా అయితే అవినీతి కేసుల విషయంలో కోర్ట్‌లు చాలా సీరియస్‌గా ఉన్నాయని, మోడీ అంతకంటే సీరియస్‌గా ఉన్నాడని….అందుకే శశికళతో సహా చాలా మందికి శిక్షలు పడుతూ ఉన్నాయని చెప్పి….. ఎన్నో రకాల మాటలు చెప్తూ చివరగా జగన్‌కి కూడా అదే పరిస్థితి ఎదురువుతుందని చెప్పేవారు. పచ్చ బ్యాచ్ మొత్తం లక్ష్యం ఒక్కటే. జగన్‌ని నమ్ముకుని ఉన్న ఎమ్మెల్యేలను, నాయకులను జగన్‌కి దూరం చేయడం, జగన్‌ని అభిమానించే ప్రజల్లో అనుమానపు బీజాలు నాటి ఆందోళన రేకెత్తించడం. ఆ లక్ష్యం విషయం పక్కనపెడితే దేశంలో ఎక్కడ ఏ నేతకు శిక్షలు పడినా తర్వాత వంతు జగన్‌దే అని అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమే అనుకుందాం…..మరి ఇప్పుడు 2జి స్పెక్ట్రమ్ కేసులో వచ్చిన తీర్పు తర్వాత జగన్ కేసులను ఎలా చూడాలి?

1.76లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకున్న కేసులోనే సాక్ష్యాలు లేవని చెప్పి నిందుతులందరినీ నిర్దోషులని చెప్తూ తీర్పు చెప్పేసింది కోర్ట్. జగన్ కేసుల విషయంలో కూడా సాక్ష్యాలు ఏమీ లేవు…..కేసులు నిరూపించబడే అవకాశమే లేదు…జగన్‌పై కేసులు నిలబడవు అని మాజీ డిజిపిల నుంచీ న్యాయకోవిదుల వరకూ అందరూ చెప్తున్న విషయమే. మరి ఇప్పుడు 2జి స్పెక్ట్రమ్ కేసులాగే జగన్‌పై కేసులు కూడా వీగిపోవచ్చు అనే విషయాన్ని పచ్చ బ్యాచ్ అంగీకరిస్తారా? 2జి స్పెక్ట్రమ్ కేసులో అయినా అవినీతి జరిగింది అని కొంత వరకూ స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ సాక్ష్యాలు లేని కారణంగా కేసులను కొట్టేసింది కోర్ట్. అదే జగన్ కేసుల విషయానికి వస్తే అవినీతి జరిగిందా? లేదా? అక్రమాస్తులా ? కాదా? అని కూడా ఇదమిత్థంగా ఇప్పటి వరకూ నిరూఫణ అయింది ఏమీ లేదు. అలాంటప్పుడు జగన్‌పై ఉన్న కేసులు కూడా ఎందుకు కొట్టివేయబడకూడదు? దేశంలో ఎక్కడ ఎవరికి శిక్ష పడినా తర్వాత వంతు జగన్‌దే అన్నట్టుగా మాట్లాడే బాబు అండ్ కో థియరీ ప్రకారం చూసుకున్నా……ఇప్పుడు 2జి స్పెక్ట్రమ్ కేసులో అందరూ నిర్దోషులని కోర్టు చెప్పింది కాబట్టి రేపు జగన్ కూడా నిర్దోషిగా విడుదలవ్వొచ్చు అని టిడిపి వాళ్ళు చెప్పగలరా? దేశంలో……ఆ మాటకొస్తే ప్రపంచదేశాల్లో కూడా ఎవరికి శిక్ష పడినా జగన్‌కి కూడా అదే గతి పడుతుంది అని దారుణంగా విమర్శలు చేసినప్పుడు…….కేసుల నుంచి ఎవరు నిర్దోషులుగా బయటిపడినా కూడా జగన్ కూడా నిర్దోషిగా బయటపడతాడు అని చెప్పాలిగా. కానీ చెప్పరు. ఎందుకంటే అదే పచ్చ సిద్ధాంతం. వీడియో, ఆడియో సాక్ష్యాలతో దొరికిన ఓటుకు నోటు కేసు తర్వాత కూడా చంద్రబాబు నిప్పు…….ఇప్పటి వరకూ ఒక్క విషయంలో కూడా అవినీతి నిరూపితం కానీ జగన్ మాత్రం అవినీతిపరుడు అని చెప్పగల సామర్థ్యం చంద్రబాబు, పవన్, టిడిపి భజన మీడియాల సొంతం మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -