తండ్రి దీవెనలతో తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ కుర్ర హీరో జయ జానకీ నాయక సినిమాతో ఘన విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. నేచర్ ఈజ్ ద విట్‌నెస్ అనేది ట్యాగ్ ఉంది. ఈ సినిమా ప్రకృతికి సంబంధించిందగి కొనసాగుతోంది. తెలుస్తోంది. ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండడం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.
ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా తదితర నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్. ఈ రోజు జన్మదినం (జనవరి 3) సందర్భంగా ఆద్య న్యూస్ శుభాకాంక్షలు చెబుతోంది.
