చంద్రబాబునాయుడి మాటలకు చేతలకు అస్సలు పొంతన ఉండదు. మాటల్లో ఒక సినిమా చూపిస్తూ ఉంటాడు. కానీ చేతలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి. అందుకే ఈ మధ్యనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులే చంద్రబాబకు ఏకంగా ‘మహానటుడు’ అన్న బిరుదు ఇచ్చాడు. ఎంత మహా నటుడు కాకపోతే తెలుగు సినిమా చరిత్రలోనే మహానటుడిగా కీర్తింపబడ్డ ఎన్టీఆర్ దగ్గరే నటిస్తూ, ప్రేమను చూపిస్తూ ఆయనకే వెన్నుపోటు పొడవగలడు. ఆ విషయం పక్కనపెడితే చంద్రబాబుతో సహా టిడిపి ఎంపీలు, మంత్రులందరూ కూడా బ్రతిమాలుకుంటే దయతలిచి చంద్రబాబుకు మోడీ అపాయింట్‌మెంట్ ఇచ్చాడన్నది నిజం. ఇక ఆ మరుక్షణం నుంచీ కూడా టిడిపి నేతలతో పాటు బాబు భజన మీడియా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీని డిమాండ్ చేయబోతున్న చంద్రబాబు, నిలదీయబోతున్న చంద్రబాబు……..రాజకీయ అవసరాలు, వ్యక్తిగత స్వార్థానికి సంబంధించిన విషయాలు అస్సలు మాట్లాడకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయంపైనే మోడీతో తేల్చుకోనున్న చంద్రబాబు అంటూ చంద్రబాబులో లేని హీరోయిజాన్ని చూపించాలని చాలా చాలానే తాపత్రయపడ్డారు. కానీ మోడీని కలిసినప్పుడు , కలిసి బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా బేల మాటలు, చేతకాని వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేసుకున్నాడు చంద్రబాబు. అయితే అన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలనే మాట్లాడానన్న కవరింగ్ మాత్రం ఇచ్చుకున్నాడు.
కానీ మోడీతో చంద్రబాబు మాట్లాడిన అసలు విషయాలు ఏంటో ఇప్పుడు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు……..ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు మాత్రం తెగతెంపులు చెయ్యొద్దు……అండ్ వైకాపాతో మోడీ అస్సలు కలవకూడదు అన్నదే చంద్రబాబు టూర్ ప్రధాన అజెండా. అవసరమైతే బిజెపికి ఎన్ని ఎంపి సీట్లయినా ఇవ్వడానికి రెడీ………పొత్తు విషయంలో మాత్రం వెనక్కి తగ్గొద్దు అన్నది బాబుగారు మోడీకి విన్నవించుకున్న విన్నపం. ఇప్పుడివే విషయాలు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజకీయాలను అద్భుతంగా విశ్లేషించే సామర్థ్యం ఉన్న రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు-మోడీల మీటింగ్ రహస్యాలను బయటపెట్టేశాడు. మోడీతో చంద్రబాబు సాగిలపడిన విధానాన్ని పూర్తిగా వివరించాడు. జగన్ అడ్డుతొలగిస్తే చాలు……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టడానికి కూడా రెడీ అనే స్థాయిలో చంద్రబాబు మోడీకి సరెండర్ అయిపోయాడని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ప్రధాని మోడీతో సహా వైఎస్ జగన్ ఎవరిని కలిసినా కూడా కేసుల మాఫీ కోసమే అని చెప్పి విషప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడేం మాట్లాడతారో చూడాలి. ఇక టిడిపి ఎంపిలలో అయితే అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపి సీటు దక్కించుకోవాలంటే బిజెపిలో ఉన్న టిడిపి కోవర్ట్స్‌ని నమ్ముకుంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటున్నారు.
