వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడులు సమకాలికులే. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవారు అన్న ప్రశ్న వస్తే రకరకాల సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ చెప్పిన విషయాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వైఎస్ గురించి చాలా మందికి తెలియని ఒక విషయం కూడా చెప్పుకొచ్చాడు జగన్. నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవి వచ్చేలా చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇక ఆ తర్వాత 1983ఎన్నికల సమయంలో మామ ఎన్టీఆర్పైన అయినా పోటీకి రెడీ డప్పాలు కొట్టిన చంద్రబాబు……తీరా టిడిపి తరపున ఎన్టీఆర్ నిలబెట్టిన ఒక అనామక అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని తీవ్రస్థాయిలో ఎన్టీఆర్‌పై విమర్శలు చేసిన చంద్రబాబు……ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ పంచన చేరి మంత్రి పదవి కూడా పొందాడు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చేరదీసి…..మంత్రిని చేసిన ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కోవడంతో పాటు ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన నైజం చంద్రబాబుది.
ఇక ఇక్కడే వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి కూడా చెప్పకొచ్చాడు జగన్. మనవడి వ్యవహారాలతో సహా అన్ని విషయాలనూ రాజకీయాలకు వాడుకునే నాయకులను చూస్తూ ఉన్నాం కానీ వైఎస్‌లు మాత్రం వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు వాడుకోరు. ఆ విషయం పక్కనపెడితే వాళ్ళు చేసే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ప్రచారం చేసుకోరు. వైఎస్ నైజం అది.
వడ్డెర కులానికి చెందిన వెంకటప్ప అనే ఒక గురువు వైఎస్ చిన్ననాడు చదువు చెప్పాడు. వైఎస్‌ని మెచ్చుకని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని రెండు మూడేళ్ళు చదువులు చెప్పాడు. తనకు చదువు నేర్పిన గురువును గుర్తుపెట్టుకున్న వైఎస్……గురువు స్మారకార్థం వెంకటప్ప మెమొరియల్ స్కూల్‌ని స్థాపించాడు. ఈ స్కూల్‌ని ఇప్పుడు కూడా వైఎస్సార్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. విద్యార్థుల యూనిఫాంతో సహా అన్ని ఖర్చులూ ఈ ట్రస్టే భరిస్తూ ఉచితంగా చదువు అందిస్తోంది. ఇప్పుడు ఆ స్కూల్లో 2500మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
వైఎస్-చంద్రబాబుల వ్యక్తిత్వాల మధ్య ఉన్న తేడాను చెప్పడానికి జగన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కూతురుని ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేసిన ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, ఆయన పదవి లాక్కుని, ఆయనపై చెప్పులేయించి, ఎన్టీఆర్‌కి విలువలు లేవు అన్న చంద్రబాబు ఎక్కడ? చిన్పప్పుడు చదువు నేర్పిన గురువు పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చెయ్యాలని చెప్పి ఆయన పేరు మీద స్కూల్ స్థాపించి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేలా చేసిన వైఎస్సార్ ఎక్కడ?
