- Advertisement -

‘రాజవంశస్థుడు’ గా రానున్న చిట్టిబాబు….

- Advertisement -

రామ్ చరణ్‌తేజ్, సమంత జోడీగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ”రంగస్థలం” మార్చి 30 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. రంగ‌స్థ‌లం మూవీలో చిట్టిబాబుగా క‌నిపించిన చెర్రీ ఇప్పుడు రాజ వంశ‌స్తుడిగా మ‌రో సారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

రంగ‌స్థ‌లం స‌క్సెస్‌ను ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశారు. త్వరలోనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాకు టైటిల్‌ను ఖ‌రారు చేసె ప‌నిలో బిజీగా ఉన్నారు బోయ‌పాటి. ఇప్ప‌టికే ఈసినిమాకు ‘రాజవంశస్థుడు’ అనే టైటిల్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట.

టైటిల్ విష‌యంలో చరణ్ తో పాటు చిరంజీవి .. అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో తమ ఆమోదాన్ని తెలియజేయవలసి ఉంటుంది. బోయపాటి ‘రాజవంశస్థుడు’ టైటిల్ ను అనుకుంటున్నట్టుగా ఇప్పటికే బయటికి వచ్చింది. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తే, అదే టైటిల్ ను చరణ్ వాళ్లు ఓకే చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. టైటిల్‌పై మ‌రి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -