గత కొంతకాలంగా టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామలపై మెగా హీరో రాంచరణ్ స్పందించారు.నిన్న(ఆదివారం)జరిగిన అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రీ-రీలిజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా వచ్చాడు రాంచరణ్.ఈ సందర్భంగా రాంచరణ్ మాట్లాడుతు గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీపై మీడియా రాతలను చరణ్ తప్పుబట్టారు.కరప్షన్ లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒకటే. మాకు ఏముంటుంది చెప్పండి. మేం ఉదయాన్ని లేచి షూటింగ్‌కి పోతాం. ఎండ, వాన దేన్ని లెక్కచేయకుండా పనిచేస్తాం.
మళ్లీ రాత్రికి వచ్చి కుటుంబంతో గడిపి ఉదయన్నే మా పని మేం చేసుకుంటాం. బన్నీ, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్,ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఇలానే కష్టపడతారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉంది అని అన్నారు.నెలలుగా సినిమా పరిశ్రమ గురించి ఏవేవో రాస్తుంది. ఏదో ఎంటర్ టైన్ చేస్తున్నాం అనుకుంటున్నారు కాని ప్రజలు అన్ని చూస్తున్నారు.మీరు హ్యాపీగా ఉండండి. మీరు బ్రతకండి అంటు తన ప్రసంగాన్ని ముగించాడు రాంచరణ్.
