- Advertisement -

ప‌వ‌న్ యాత్ర‌కు సిద్ధ‌మైన రూట్ మ్యాప్‌….

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజ‌కీయాపార్టీలు త‌మ కార్య‌క‌లాపాల‌ను ముమ్మ‌రం చేస్తున్నాయి. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాద‌యాత్ర పేరుతో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా వింటూ పార్టీ ప్ర‌క‌టించ‌ని న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ బ‌స్సుయాత్ర చేయనున్నారు.

జ‌గ‌న‌సే పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌కూడా మ‌రింత దూకుడును పెంచ‌నున్నారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యోందుకు ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తోంది పార్టీ. తాజాగా జ‌న‌సేనుడుకూడా ఏపీ యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను కలిపేలా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఒకటి రెండు రోజుల్లో యాత్ర పేరు, షెడ్యూలు, ప్రారంభ తేదీ, యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది? అనే విషయాలను జనసేన వెల్లడించనుంది. అలాగే, యాత్ర రూట్‌మ్యాప్ కసరత్తు కూడా దాదాపు ఖరారైనట్టు సమాచారం. యాత్ర కోసం పవన్‌కు ప్రత్యేకంగా ఓ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ప్ర‌క‌టించారు. 40 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. పది జిల్లాలను కవర్ చేస్తారు. ఇందుకోసం, ప్రత్యేకంగా లగ్జరీ బస్సును సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సులో విశ్రాంతి గది, సమావేశపు గది, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ సౌకర్యం, యాత్ర సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు బస్సు పైకి వెళ్లేందుకు నిచ్చెన వంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటాయి

యాత్ర‌లో భాగంగా స్థానిక సమస్యలను గుర్తించడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది. సమస్యలను గుర్తించిన తర్వాత వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై తీసుకొచ్చే ఒత్తిడితోపాటు, ఆ విషయంలో తమ పార్టీ విధానం ఏంటనేది అక్కడికక్కడే ప్రకటిస్తారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -