- Advertisement -

జగన్ యాత్ర గోదావరి జిల్లాల ప్రజలను మెప్పించిందా?

- Advertisement -

రెండు గోదావరి జిల్లాల్లోనూ సుదీర్ఘంగా పాదయాత్ర చేశాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారాన్ని డిసైడ్ చేసే చోట జగన్ పాదయాత్ర ప్రభావం ఎంత అన్న ప్రశ్నలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. వైకాపాతో పాటు టిడిపిలోనూ ఈ చర్చ నడుస్తోంది. గ్రౌండ్ లెవెల్‌లో పాదయాత్ర ప్రభావాన్ని అధ్యయనం చేసిన సీనియర్ జర్నలిస్టులు ఈ విషయంపై రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాదయాత్ర మొత్తం ఒక ఎత్తు……..చివరి రోజుల్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, కాపు రిజర్వేషన్స్ గురించి జగన్ మాట్లాడిన మాటలు మరొక ఎత్తు అని వాళ్ళు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం పాదయాత్ర ప్రభావం రెండు గోదావరి జిల్లాల్లోనూ బలంగా ఉందన్న విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి శ్రేణులను యాక్టివ్‌గా ఉంచడమే చాలా పెద్ద సమస్య. ఆ కోణంలో చూస్తే జగన్ పాదయాత్ర సమయంలోనూ, ఆ తర్వాత కూడా వైకాపా శ్రేణులు నాయకుల హల్చల్ రెండు గోదావరి జిల్లాల్లో ఓ స్థాయిలో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విషయంలో చూసీ చూడనట్టుగా పోవాల్సిన అవసరం లేదన్న సంకేతాలను స్పష్టంగా ఇవ్వడానికే పవన్ వ్యక్తిగత జీవితంపై తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశాడు జగన్ అన్నది నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా రామోజీరావు జేబులో బొమ్మ అన్నది నిజం. 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ పచ్చ బ్యాచ్ పంచనే పవన్ చేరుతాడన్న నిజాన్ని కూడా విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కూడా పవన్‌కి వ్యతిరేకంగా స్పష్టమైన స్టాండ్ తీసుకుని వైకాపా శ్రేణులకు దిశానిర్దేశం చేశాడు. ఇక కాపు రిజర్వేషన్స్ విషయంలో కాపులందరూ జగన్‌కి దూరమయ్యారు అని పచ్చ బ్యాచ్ మీడియా చేసిన ప్రచారం అంతగా ఫలించలేదని తెలుస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో పూర్తిగా చంద్రబాబు, పవన్, మోడీల కూటమికి పడిన గోదావరి జిల్లాల ప్రజల ఓట్లు ఈ సారి వైకాపా, జనసేన, టిడిపిల మధ్య చీలనున్నాయి. రెండు గోదావరి జిల్లాల్లోనూ టిడిపితో సమానంగా వైకాపాకు కూడా సీట్లు వస్తాయన్న సర్వేల అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అదే నిజమైతే మాత్రం రాయలసీమలో అన్ని పార్టీలకంటే బలంగా ఉన్న వైకాపా 2019 ఎన్నికల్లో విజేతగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

మరోవైపు వైకాపాకు సంబంధించి కొన్ని మైనస్‌లను కూడా విశ్లేషకులు చెప్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళడంలోనూ, వైకాపా శ్రేణులను యాక్టివ్ చెయ్యడంలోనూ పూర్తిగా సక్సెస్ అవుతున్న జగన్……..టిడిపిలోకి ఫిరాయించిన నేతల స్థానాలలోనూ, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ఫైనల్ చేయడంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ఎంత త్వరగా ఫైనల్ చేస్తే వైకాపా అంతగా లాభపడుతుందనడంలో సందేహం లేదు. ఇక జగన్ పాదయాత్ర ప్రభావం 2019 ఎన్నికల్లో వైకాపాకు కలిసొస్తుందని గోదావరి జిల్లాలకు చెందిన ఒక సీనియర్ టిడిపి నాయకుడు అభిప్రాయడడం గమనార్హం. అందుకే ఈయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపిగా పోటీ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాడని టిడిపి నేతలే అంతర్గతంగా చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -