- Advertisement -

మ‌హా కూట‌మిలో కోదండ‌రామ్ కీల‌క పాత్ర … పోటీకీ మాత్రం నై..?

- Advertisement -

తెలంగాణాలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్త‌ల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. అందుకే మ‌హాకూట‌మిని ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టిజెఎస్‌లు క‌ల‌సి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ్డాడి. అయితే ఈ కూట‌మిలో కోదండ‌రామ్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కూటమికి తెలంగాణ పరిరక్షణ వేదిక అనే పేరును ఖరారు చేశారు. ఈ వేదికకు కోదండరామ్ నేతృత్వం వహించే అవకాశం ఉంది. సీట్ల పంప‌కాల‌నుంచి మిగితా కార్య‌క్ర‌మాల‌లో కోదండ‌రామ్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఒక వేల కూట‌మి అధికారంలోకి వ‌స్తే సిఎంపి అమ‌లును కూడా ఈ వేదిక‌నే నిర్వ‌హిస్తుంది.

కమిటీ తరఫున ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక (సిఎంపి)ని రూపొందించడంలో కూడా ఆయనదే కీలక భూమిక అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేసే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. పోటీ చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని మహా కూటమి విజయానికి కృషి చేస్తారని అంటున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సీట్ల స‌ర్దుబాట్ల విష‌యం కూడా ఓ కొలిక్కి రాలేదు. టీడీపికి 14, టీజెఎస్ కు 5, సిపిఐకి 3 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెసు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, టీడీపి 20, సిపిఐ 8, టిజెఎస్ 10 స్థానాలను అడుగుతున్నాయి. సీట్ల స‌ర్దుబాటు అంశాన్ని కూడా కోదండ‌రామ్‌కు అప్ప‌గించాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. మ‌రో వైపు టీడీపీ ఉప ముఖ్య‌మంత్రిపద‌విని అడుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా సీట్ల స‌ర్దుబాబు ఓ కొలిక్కి రాక‌పోవ‌డం కొంత ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -