- Advertisement -

ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా

- Advertisement -

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇండియా మొద‌ట బ్యాటింగ్ తీసుకుంది.రోహిత్ శ‌ర్మ మొద‌ట ఔట్ అవ్వ‌గా జోరు మీదున్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఔటయ్యాడు.. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోవడంతో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న ఇండియా తన జట్టులో ఓ మార్పు చేసింది.

తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ ను తీసుకుంది. వెస్టిండీస్ జట్టులో కూడా ఓ మార్పు జరిగింది.ఓబెండ్ మెకోయ్ అంతర్జాతీయ వన్డేలో ఆరంగేట్రం చేశాడు. ఓషానే థామస్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. కోహ్లీ 12పరుగులతోనూ, రాయుడు 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -