టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేధికగా మండిపడ్డారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ ల గురించి విన్నామని, ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగ్ లను చూస్తున్నామని ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ ’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
ఈ మధ్య ఓటర్ల జాబితాలో చాలా పేర్లు మాయం అయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఓట్లను తొలగించారనే ప్రచారమూ సాగుతోంది. పవన్ తన జనసేన పోరాటయాత్రలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాజాగా వైసీపీ కూడా ఇదే అంశాన్ని తెరపైకి తెచ్చింది.
ఈ విషయమై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని తమ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకున్నారని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ ను జతపరిచారు.
చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు ని చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు దీని గురించి ఏమి మాట్లాడతారని నేను ఎదురు చూస్తున్నాను. Party leaders have taken the decision to lodge a complaint with ‘Election Commission.’ pic.twitter.com/643bwDS3eD
— Pawan Kalyan (@PawanKalyan) November 1, 2018
