యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.ప్రభాస్‌కు చెందిన ఓ గెస్ట్ హౌస్‌ను సీజ్ చేశారు తెలంగాణ అధికారులు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..రాయదుర్గం పరిసరాల్లోని ప్రభాస్ అతిధి గృహాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం సంచలనంగా మారింది.రాయ దుర్గం గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టు కేసు నడుస్తోంది. దీని పై కోర్టు తీర్పు వెలువడి పరిష్కారం లభించడంతో శేరిలింగంపల్లి తహశీల్దారు వాసుచంద్ర ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు.
ఆ స్థలంలోనే ప్రభాస్ కు చెందిన అతిధిగృహం ఉండడంతో దానిని అధికారులు సీజ్ చేశారని తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌజ్ ఉండడం వల్లనే ఈ చిక్కులు అని తెలుస్తోంది. రెండోసారి పగ్గాలు చేపట్టిన గులాబీ అధినేతలు ఇకపై నగరంలో ఎలాంటి అవినీతిని సహించేది లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని తెలుస్తుంది.ప్రభాస్ పెదనాన్న అయిన కృష్ణంరాజు బీజేపీలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు.దీని కారణంగానే ప్రభాస్ గెస్ట్ హౌస్‌ను సీజ్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.మరి దీనిపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్నాడు.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
