హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, సమాజంలో జరుగుతన్న విషయాలపై ఎప్పటికప్పుడు తన ట్విట్టర్లో స్పందిస్తుంటాడు మనోజ్. తాజాగా మనోజ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ట్విట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే కియా మోటర్స్ ఏపీలో తమ కార్యకలపాలను మొదలుపెట్టింది.
దీనికి సంబంధించిన తొలి కారును కూడా విడుదల చేశారు. కియా మోటార్స్ ఏపీకి రావడంపై మంచు మనోజ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. అయితే ట్విట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్విట్‌ను డిలీట్ చేశాడు మనోజ్. అయితే మనోజ్ ఎందుకు ట్విట్‌ను డిలీట్ చేశారని ప్రశ్నించడం మొదలుపెట్టారు నెటిజన్లు. దీనిపై స్పందించిన మనోజ్ తన స్నేహితుడు వల్ల ఆ ట్విట్‌ను డిలీట్ చేశానని సమాధానం చెప్పాడు మనోజ్. కొద్దిసేపటికి ఈ ట్విట్‌ను కూడా డిలీట్ చేయడంతో నెటిజన్లు మనోజ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో నెటిజన్లపై కోపంతో మనోజ్ అసభ్యకర పదజాలంతో మరో ట్విట్ చేశాడు.
నేను ఎవరి కారణంగానో ప్రభావితమై ట్వీట్ డిలీట్ చేశానని భావించే వారందరికీ నా డ్యాష్(ఎవరికీ అంత బొమ్మ లేదు).. నేను నిజాయితీగా ఉన్నానని భావించే ప్రతి ఒక్కరికీ.. ‘వెధవలని లైట్ తీసుకోండి'(పాపం వాళ్లూ మన భారతీయులే” అంటూ రాసుకొచ్చాడు. మనోజ్ ఇలా ట్విట్ చేయడంపై నెజిన్లు మండిపడుతున్నారు. ఒక సెలబ్రిటీ అయి ఉండి , ఇలాంటి పదాలను పబ్లిక్‌లో వాడుతారా అంటూ మనోజ్‌పై ఫైర్ అవుతున్నారు.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్‌గా అక్రమకేసులు!
