- Advertisement -

డ్యాక్రా మ‌హిళ‌ల‌ను వెన‌క్కి పంపేస్తున్న బ్యాంక్ అధికారులు

- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మం పసుపు – కుంకుమ. డ్వాక్రా మ‌హిళ‌ల కోసం పసుపు – కుంకుమ పేరిట 10 వేల రుపాయిల చెక్కును అంద‌జేశారు.ఎన్నిక‌ల ముందు ప్ర‌వేశపెట్టిన ఈ ప‌థ‌కంతో మ‌హిళ‌ల ఓట్లు పొంద‌వ‌చ్చని టీడీపీ ప్ర‌భుత్వం ఆశించింది. అయితే ఈ చెక్కుల‌ను తీసుకుని బ్యాంకుల‌కు వెళ్లిన మ‌హిళ‌ల‌కు షాకిస్తున్నారు బ్యాంక్ అధికారులు. ప్ర‌భుత్వం ఇచ్చిన చెక్కు తీసుకుని బ్యాంక్‌కు వెళ్ల‌గా…గ‌తంలో మీరు క‌ట్టాల్సిన బాకాయి కింద ఈ చెక్కును జ‌మ చేసుకుంటున్నామని చెప్పి డ్యాక్రా మ‌హిళ‌ల‌కు షాకిచ్చారు బ్యాంక్ అధికారులు.

దీంతో డ్వాక్రా మ‌హిళ‌లు ధర్నాకు దిగారు. ఒక్కో పొదుపు మహిళకూ రూ. 10 వేల చొప్పున ఏపీ సర్కారు చెక్కులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో ఆశతో బ్యాంకుకెళ్లిన మహిళలు, అధికారులు చెప్పిన మాటతో అవాక్కైన పరిస్థితి. బ్యాంకుల వద్ద డ్వాక్రా మ‌హిళ‌లు ధర్నా చేయ‌డంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని డ్వాక్రా మ‌హిళ‌లకు స‌ర్ది చేప్పే ప్ర‌య‌త్నం చేశారు. మొత్త‌నికి బాబుగారు చెల్ల‌ని చెక్కులు ఇచ్చి భ‌లే ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని అంటున్నారు డ్వాక్రా మ‌హిళ సంఘాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -