Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్నికల ప్రచారం చివరలో బాబు, పవన్ ను దుమ్ముదులిపిన జగన్..

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులుగా రాజకీయ నాయకుల ప్రసంగాలు, లైడ్ స్పీకర్లతో దద్దరిల్లిన రాష్ట్రం ఒక్క సారిగా మూగబోయింది. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఇక తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో చివరన జగన్ బాబు, పవన్ ను దుమ్ముదులిపారు. చెప్పులు వేసుకొని తిరుమళ కొండపై వెల్లారని పవన్ చేసిన వ్యాఖ్యలకు జగన్ అదిరిపోయె కౌంటర్ ఇచ్చారు.

తిరుమల కొండపైకి తాను చెప్పులు లేకుండా కాలినడకన వెళ్లానని, 3200 మెట్లు ఎక్కానని స్పష్టం చేశారు జగన్ . చెప్పులతో వెళ్లానంటూ దుష్ప్రచారం చేయడం తగదని పవన్ కు హితవు పలికారు.చంద్రబాబు పార్టనరే బూట్లు వేసుకుని కొండపైకి వెళ్లారని పవన్ పై విమర్శలు చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి జీవనాడి లాంటి ప్రత్యేక హోదా రావాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదాకు పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ మద్దతు ప్రకటిస్తే కనీసం టీడీపీ నేతలు కృతఙ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే మన రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలతో పాటు పక్క రాష్ట్రానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా కలిస్తే ప్రయోజనం ఉంటుందని …బాబు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకున్న పాపానా పోలేదన్నారు. బాబు పాలనలో అన్ని సంక్షేమ పథకాలో మూలనపడ్డాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే స్వర్ణయుగం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ‘నవరత్నాలు’ అమలు చేసి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -