- Advertisement -
ఎన్నికల నిబంధనలు ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రెండో రోజు కూడా మంత్రి సోమిరెడ్డికి వ్వవసాయ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు.మంత్రి సమీక్షకు బుధవారం కూడా హాజరు కాకుండా ఆయనకు షాక్ ఇచ్చారు. మంత్రి సోమిరెడ్డి నిన్న ఉద్యానవన శాఖ సమీక్ష ఏర్పాటు చేశారు. ఈ సమీక్షకు అధికారులు హాజరు కావాలని సర్కులర్ కూడా జారీ చేశారు. అయితే అధికారులు ఎవరూ సమీక్షకు హాజరు కాకుండా ఝలక్ ఇచ్చారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్షా సమావేశానికి వెళితే ఏం ఇబ్బంది వస్తుందో అని భావించిన అధికారులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ అధికారుల కోసం ఎదురుచూసిన సోమిరెడ్డి, చివరికి చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
