Tuesday, April 30, 2024
- Advertisement -

‘జగన్ అను నేను’ ఈనెల 30న తిరుపతిలో ప్రమాణ స్వీకారం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 30న తిరుపతిలో వెంకన్న సాక్షిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫ‌లితాల అనంత‌రం జ‌గ‌న్ తిరుమ‌ళ వెంక‌న్న స్వామిని ద‌ర్శించుకొన్న అనంత‌రం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని ఆపార్టీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు వెల్ల‌డించారు. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారానికి తిరుపతిలో తారకరామ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

2019 ఎన్నికలకు సంబంధించిన తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. ఫిబ్రవరి 6న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించిన జ‌గ‌న్ అక్క‌డ‌నుంచె 13 జిల్లాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాచ‌రు. మొత్తం మీద ఎన్నికల ప్రచారం నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం వరకు తిరుపతి సెంటిమెంట్‌ను జగన్ ఫాలో అయ్యారు.

ఈనెల 30న దివ్యమైన ముహుర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోజు ఏకాదశి కావడంతో … జగన్ సీఎంగా అదేరోజు బాధ్యతలు తీసుకుంటే మంచిందని తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి సంబంధించిన ముహుర్తంపై ఇప్పటికే జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఈఎన్నిక‌ల్లో వైసీపీ బంప‌ర్ మెజారిటీతో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 6 సీట్ల‌లో గెలుపొంద‌గా 147 సీట్ల‌లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. టీడీపీ 22 సీట్ల‌లో లీడ్‌లో కొన‌సాగుతోంది.యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను……..యావత్తు తెలుగు జాతి గర్వించే విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు తలెత్తుకునే విధంగా మా నాయకుడు 30 సంవత్సరాలకు పైగా పాలిస్తాడు అని చెప్పుకునే వైస్సార్ అభిమానులులకు ఎంతో అసలుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -