Tuesday, May 14, 2024
- Advertisement -

వైఎస్, వర్షం.. ఓ అనుకూల కథ..

- Advertisement -

2004కు ముందు సంగతి.. చంద్రబాబు అధికారంలో ఉన్నారు. ముఖ్యంగా 2002,03,04 సంవత్సరాల్లో భీకర కరువు. చంద్రబాబు పాలనలో అస్సలు వానలు పడలేదు. వరుణుడు కరుణించక ఏపీలో కరువు కరాళ నృత్యం చేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువుకు రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. దీనిపై హైదరాబాద్ ఆందోళనలు చేస్తే తుపాకులతో కాల్చేసింది బాబు సర్కారు. రైతన్నల ఆగ్రహమే బాబును 10 ఏళ్లు అధికారానికి దూరం చేసింది.

మళ్లీ 2014లో విభాజిత ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. ఈ ఐదేళ్లు కూడా వానలు సరిగా పడింది లేదు. ఆడపా దడపా కొడుతున్నా పూర్తి స్థాయిలో కాలం అయ్యింది లేదు. రైతుల పంటలు పండింది లేదు. ఇలా బాబు పాలనలో వరుణుడు శీతకన్ను చూశాడు. అదే వైఎస్ పాలనలో 2005 నుంచి 2010 వరకు కూడా వానలు బాగా పడ్డాయి. పాడి పంట కళకళ లాడింది. వైఎస్ కు వరుణుడి కరుణ బాగా బాగా కలిసివచ్చి రెండోసారి గెలిచారు.

ఇప్పుడు మే 23న జగన్ గెలిచిన రోజు కూడా ఏపీవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా రాయలసీమలో భీకర వాన పడింది. జగన్ అధికారంలోకి రావడంతోనే ఇలా వర్షాలు పలకరించడం శుభపరిణామంగా భావిస్తున్నారు. ఇక నిన్నటి వరకు మండిన ఎండలకు ఏపీలో అల్లాడారు. కానీ జగన్ ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు నిన్న రాత్రి విజయవాడలో భారీ వర్షం కురిసింది.ప్రమాణ స్వీకార వేదిక మొత్తం తడిసిపోయింది. అయినా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ భారీ వర్షం పడడం శుభసూచికంగా.. ఈ ఏడు వానలు కరుణిస్తాయన్న అంచనాకు వచ్చారు.

ఇలా వైఎస్ కుటుంబానికి, వర్షాలకు అవినాభావ సంబంధం ఉంది. నాడు వైఎస్ఆర్ కు.. నేడు జగన్ కు వానలు ఇతోదికంగా సాయపడుతున్నాయి. రైతులను ఆనందంలో ముంచుతున్నాయి. అధికారంలో ఉన్నవాళ్లకు వానలు పడితే అంతకంటే శుభపరిణామం లేదు. ప్రజలు సుఖంగా ఉంటే పాలకుల అధికారానికి కూడా ఢోకా ఉండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -