- Advertisement -

హీరోయిన్ సింధు మీనన్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ?

- Advertisement -

నటి సింధు మీనన్ అందరికీ బాగా సుపరిచితమే. శ్రీహరి గారు హీరోగా వచ్చిన భద్రాచలం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే చక్కని నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది సింధు.

ఆ తర్వాత త్రినేత్రం, సిద్ధం, శ్రీరామచంద్రులు, చందమామ, వైశాలి, వంటి సినిమాలతో పాటు తెలుగు, తమిళంలో వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సింధుమీనన్. నటిగా కెరీయర్ లో కాస్త ఆఫర్స్ తగిన టైంలోనే లండన్ లో సెటిలైన తెలుగు ఐటీ ఎంప్లాయ్‍ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సింధు మీనన్ భర్త పేరు ప్రభు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక పాప ఒక బాబు.

ప్రస్తుతం సింధూ తన పిల్లల అలనా పాలన చూసుకుంటూ లండన్ లోనే సెటిలై చక్కని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్బై చెప్పిన సింధుకి మళ్లీ నటించాలనే ఆలోచన లేనట్లు సమాచారం. తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని పొందిన సింధు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -