Sunday, June 2, 2024
- Advertisement -

బిచ్చ గాడు డైరెక్టర్ మరొక సినిమా తెస్తున్నాడు

- Advertisement -

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లలో డబ్బింగ్ సినిమా బిచ్చగాడుని తప్పనిసరిగా చేర్చాలి. 50 లక్షలతో రైట్స్ కొని రిలీజ్ చేస్తే.. మొత్తంగా 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు బిచ్చగాడు. ఈ తమిళ బిచ్చగాడికి తెలుగులో ఇంకా కౌంటింగ్ కంప్లీట్ కాకపోవడం విశేషం.

ఇంత భారీ సక్సెస్ ను సాధించిన నిర్మాత చదలవాడ లక్ష్మణ్.. ఇప్పుడు మరో సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఆన్ మరియా కలిప్పిలాను’ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఓ నేరస్తుడితో స్నేహం చేసిన ఓ చిన్నారి.. ఆ తర్వాత తన ప్రవర్తనలో అతనిలో మార్పు ఎలా తీసుకొచ్చిందన్నదే సినిమా స్టోరీ. చెప్పడానికి సింపుల్ గానే ఉన్నా.. దీన్ని తీసిన విధానం సూపర్బ్ గా ఉండడంతో.. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ చిన్నారిగా బేబీసారాతోపాటు నేరస్తుడిగా సన్నీ వేన్ నటించగా.. ఈ చిత్రానికి దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ ని స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. ఇంకా తెలుగు వెర్షన్ కి డిసైడ్ చేయలేదు కానీ.. ఈ చిత్రాన్ని కూడా కోటి రూపాయల్లోపే కొనుగోలు చేసినట్లు చెప్పుకుంటున్నారు. మంచి కంటెంట్ ని ఏరి  ఎంచుకోవడమే కాకుండా.. తెలుగు నేటివిటీ కి సమస్య రాకుండా సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలో ఈ నిర్మాత టేస్ట్ ని అందరూ అభినందిస్తున్నారు.

Related 

  1. అమెరికా వెళ్తున్న బిచ్చగాడు!
  2. బిచ్చగాడు ఇప్పుడు బేతాళుడు , విజయ్ యాంటోనీ కొత్త సిన్మా
  3. తగ్గే ప్రసక్తే లేదంటున్న బిచ్చగాడు
  4. బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -