Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్ బాస్ పై అవగాహన లేకుండా ఇంట్లోకి వచ్చారా… పనికిరాని పనులు ఎందుకు…

- Advertisement -

బిగ్ బాస్ మూడవ సీజన్ లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ అందరినీ ఒక సందిగ్ధంలో ఉంచింది. ఎందుకంటే బిగ్ బాస్ ను రోజూ ఫాలో అవుతున్న వారందరికీ తెలుసు సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగి రాత్రి 10.30 తర్వాత నుండి నామినేషన్ లో ఉన్న వాళ్ళకి ఓట్ చెయ్యోచ్చు. కానీ నిన్న నామినేషన్ పూర్తి కాలేదు. ఇంకా రవి, వితిక, శివజ్యోతి, రాహుల్ ఉన్నారు. పోనీ అలా చూసుకున్నా నిన్న జరిగిన పూర్తి ప్రక్రియలో నామినేట్ అయ్యింది మహేష్ మాత్రమే. సో ఓటింగ్ కి అసలు ఛాన్సే లేదు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది అంటే ఈ శనివారం నో ఎలిమినేషన్ ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రమే అని.

బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ నిన్న చూసిన ఎపిసోడ్ లో బాగా కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే నిన్నటి నామినేషన్ ప్రక్రియకు, బిగ్ బాస్ రెండవ సీజన్ జరిగిన ఒక నామినేషన్ ప్రక్రియకు పోలిక ఉంది. బిగ్ బాస్ 2 లో కూడా నిన్న జరిగిన విధంగా ఒక వారం నామినేషన్ ప్రక్రియ జరిగింది.. అప్పుడు కూడా ఇలానే పోటీలు పడి మరీ త్యాగాలు చేశారు.. కానీ తరువాత వీకెండ్ ఎపిసోడ్ లో నానీ వచ్చి అందరినీ పిచ్చి తిట్లు తిట్టాడు, ఎందుకంటే నామినేషన్ అంటేనే ఇంట్లో నుండి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళడానికి మార్గం. అలా జరిగితేనే చివరకు మిగిలిన వారు గెలుస్తారు. అంటే ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేసుకుంటూ పోయేదే ఈ గేమ్.. ఆ విషయమే మర్చిపోయారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. వారికి ఇష్టంలేని కంటెస్టెంట్ నో లేక వారికి పోటీ ఉన్న కంటెస్టెంట్ నో నామినేషన్ లోకి నెట్టి ఎలిమినేషన్ దిశగా పంపించే గొప్ప అవకాశాన్ని అసలు పంటించుకోలేదంటే వారు గేమ్ మీద ఎంత మేరకు ఫోకస్ ఉంచారు అనేది చూడాలి ముందుముందు.

ఇదే ప్రక్రియ బిగ్ బాస్ రెండవ సీజన్ లో జరిగినా, మళ్ళీ అదే తప్పు మూడవ సీజన్ కంటెస్టెంట్ కూడా చేస్తున్నారంటే… ఒకటి వారు బిగ్ బాస్ చూడకుండా అయినా లోపలికి వచ్చి ఉండాలి లేకపోతే ఇది గేమ్ లో తప్పనిసరి భాగం అయినా అయి ఉండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -