Sunday, May 19, 2024
- Advertisement -

2.0 ద్వారా గ్లోబ‌ల్ మెసేజ్ ఇచ్చిన‌ శంక‌ర్

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన రోబో 2.0 ఈ రోజే విడుద‌ల అయింది. స్టార్ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమా ద్వారా గొప్ప సందేశాన్నిచ్చారు డైరెక్ట‌ర్ శంక‌ర్‌.ఇండియాలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఓ గ్లోబ‌ల్ సందేశాన్నిచ్చారు. ఈ సినిమా ద్వారా ప్రపంచంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని ఈ సినిమా ద్వారా తెలిపారు. మనుషుల అవసరాలకు ఇతర జీవాల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ప్రపంచానికి మనుషులు జీవన విధానానికి పక్షులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శంకర్ చెప్పిన విధానం ప్రశసించాల్సిన విషయం. పచ్చగా ఉండే ప్రకృతిని పురుగులు నాశనం చేస్తాయి. వాటిని అదుపుచేయడానికి పక్షులు వాటిని తింటాయి.

ఇక కొన్ని రకాల పక్షులు వాతావరణంలో మార్పులు తెస్తాయని వర్షాలు కురవడానికి కారణమవుతాయనే లోగుట్టును అందరికి తెలిసేలా చేశారు.ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. క్షులు కేవలం అధిక రేడియేషన్ కారణంగా చనిపోతుండడం మానవాళికి ఎంత ప్రమోదమో చెప్పకనే చెప్పాడు. మొబైల్స్ వాడకంలో పక్షుల రక్తపు బొట్టు ఉందని అవి అంతమైతే మానవాళి మనుగడం మరింత ప్రమాదమని హెచ్చరించాడు. మొత్త‌నికి ఈ సినిమా ద్వార శంక‌ర్ త‌ను ఏం చెప్ప‌ద‌లుచుకున్నాడో ప్రేక్ష‌కుల‌కు అర్థం అయ్యేలా తీర్చిదిద్ద‌డంలో విజ‌యవంతం అయ్యార‌ని చెప్పాలి.మరి సినిమా చూసి అయిన ప్ర‌జ‌లలో మార్పు వ‌స్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -