Sunday, May 19, 2024
- Advertisement -

’క్షణం’ ‘ రివ్యూ

- Advertisement -

అడవి శేష్ సినిమాకి కూడా జనాలకి హైప్ ఒచ్చింది అంటే సినిమాల మీద జనాల ఆసక్తి ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ట్రైలర్ సరిగ్గా కట్ చేసి, ఆసక్తికర కథనం తీసుకుని , పబ్లిసిటీ సరిగ్గా చేస్తే స్టార్ ఇమేజ్ తో అసలు పనేమీ లేదు అని నిరూపిస్తున్నాయి ఈమధ్య కొన్ని సినిమాలు అందులో మొట్ట మొదటగా మాట్లాడుకోవాల్సింది క్షణం సినిమా గురించి.

అదా శర్మ హీరోయిన్ గా, అడవి శేష్ హీరోగా అనసూయ భరద్వాజ్ పోలీస్ పాత్రలో కీలకంగా నటించిన క్షణం సినిమా ఇవాళ విడుదల అయ్యింది. పీవీపీ నిర్మాణ సారధ్యంలో ఒచ్చిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో చూద్దాం రండి.

కథ – పాజిటివ్ లు

అదా – అడవి శేష్ లు ఘాడంగా ప్రేమించుకుంటారు. కొన్నాళ్ళ తరవాత అనుకోని తరుణంలో విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. అసలు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా ఒకరికి తెలియకుండా మరొకరు ఉంటూ ఉన్న తరుణం లో చాలా సంవత్సరాల తరవాత తన మాజీ ప్రేయసి నుంచి శేష్ కి ఫోన్ ఒస్తుంది. అప్పటికి అతను ఇండియా ఖాళీ చేసి అమెరికా లో ఉంటాడు. తన బిడ్డ తప్పిపోయింది అనీ ఎవరో కిడ్నాప్ చేసారు అనీ తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటూ ఆ కాల్ సారాంసం. ప్రేమ చచ్చిపోయినా ఫీలింగ్స్ చావని శేష్ వెంటనే హుటా హుటిన ఇండియా బయలుదేరతాడు. ఆ పాపని ఎవరు కిడ్నాప్ చేసారు దేనికోసం చేసారు ఇప్పుడు పాపని ఎలా పట్టుకోవాలి అనే కోణం లో సినిమా సాగుతుంది. ఈ నేపధ్యంలో అనేక విషయాలు బయట పడుతూ ఉంటాయి. మధ్యలో అనసూయ పోలీస్ పాత్రలో వీరిద్దరికీ సహాయం చేస్తూ ఉంటుంది. తన పాప ని ఎవరు ఎత్తుకుని వెళ్లారు అనే కాన్సెప్ట్ మీద తల్లి బాధ పడుతూ ఉండగా హీరో క్రిమినల్స్ ని వెతికే సీన్ లు రక్తి కట్టించాడు డైరెక్టర్. పాప ని చూపించకుండా అసలు పాప నిజంగా ఉందా లేదా అనే సస్పెన్స్ ని చాలా చక్కగా క్యారీ చేయ్యగాలిగాడు. అనసూయ – శేష్ ల మధ్య వచ్చే యాక్షన్ సీన్ లు కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. పూర్తి థ్రిల్లర్ కథాంశాన్ని కొంగోత్తగా కమర్షియల్ పంథాలో చెప్పుకుపోయాది దర్శకుడు. క్లిమాక్స్ – ప్రీ ఇంటర్వెల్ సినిమాకి పెద్ద హై లైట్ లు అని చెప్పాలి . తక్కువ నిడివి కేవలం రెండు గంటల నిడివి ఉండడం ఈ సినిమా ని ఆద్యంతం గ్రిప్పింగా ఉంచింది. ఎడిటింగ్ క్లియర్ గా చేసి ఎక్కడా బోర్ కొట్టించకుండా చేసాడు డైరెక్టర్ .  

సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించే విషయం తప్ప పెద్దగా నెగెటివ్ లు ఏమీ లేవు. కామెడీ సరిగ్గా సెట్ కాలేదు, అసలు అనవసరమైన చోట కామెడీ జొప్పించారు అనిపించింది. కథలో ట్విస్ట్ రివీల్ అయిపోయిన తరవాత ఇంతేనా విశేషం అనిపించక మానదు. అనసూయ ని గ్లామరస్ గా చూడాలి అనుకున్నవారికి పెద్ద నీరు గార్చే సినిమా అని చెప్పచ్చు. అక్కడక్కడా కొన్ని లాజిక్ లు మిస్ అయ్యాడు డైరెక్టర్.

మొత్తంగా :

ఈ మధ్య వచ్చిన అత్యంత తక్కువ బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా పెద్ద హిట్ సాధిస్తుంది అని తేలికగా చెప్పచ్చు. పీవీపీ నిర్మాణ సంస్థ పెట్టిన 1 రూపాయలకి కచ్చితంగా ఐదారు రెట్లు వచ్చి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీక్ ఎండ్ లో ఫ్యామిలీ మొత్తం తో కలిసి చూడదగ్గ అందమైన థ్రిల్లర్ కథ. అందులోనే ప్రేమ నీ, మదర్ సెంటిమెంట్ నీ, యాక్షన్ డ్రామానీ జోడిస్తూ డైరెక్టర్ తన పని కానిచ్చాడు. తలనొప్పి మూస సినిమాల నుంచి తలకాయ బయటపెట్టి ఒక ఆసక్తికర థ్రిల్లర్ చూడాలి అని మీరు అనుకుంటున్నట్టు అయితే ఈ వారాంతానికి ‘క్షణం’ సినిమా మీకు వన్ అండ్ ఓన్లీ చాయిస్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -