Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ అదిరింది…… ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ బాలయ్య వెర్షన్‌నా?

- Advertisement -

తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథను తానే హీరోగా సినిమా రూపొందిస్తానని బాలయ్య చెప్పినప్పటినుంచే ఆ సినిమాపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. నేనే రాజు…..నేనే మంత్రి సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ కొట్టిన తేజ దర్శకత్వం చేస్తాడు అని తెలిసిన తర్వాత ఆ క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఈ రోజు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇనానిమస్‌గా మంచి అప్లాజ్ వస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు వరకూ కూడా కేవలం సినిమా హీరోగా ఎన్టీఆర్ జీవితకథ మాత్రమే ఉంటుందని అంచనాలు వేశారు. అయితే ఇప్పుడు మాత్రం పూర్తికథపై అవగాహన వస్తోంది.

ఎన్టీఆర్ సినిమా జీవితంతో పాటు రాజకీయ జీవితాన్ని కూడా పూర్తిగా చూపిస్తారట. వెన్నుపోటు సమయంలో బావ అయిన చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఎన్టీఆర్‌కి ఆత్మక్షోభను కలిగించిన బాలకృష్ణ ఎన్టీఆర్ వెన్నపోటు ఎపిసోడ్‌ని తెరకెక్కించడానికి ఎందుకు ఒప్పుకుంటాడు అని ఆశ్ఛర్యపోతున్నారా? అసలు విషయం ఏంటంటే వెన్నుపోటు ఎపిసోడ్ కూడా బాలయ్య కోణంలో ఉంటుందని తెలుస్తోంది. వెన్నుపోటు రాజకీయం చేసి పిల్లనిచ్చిన మామకే ద్రోహం చేస్తూ ఆయన పార్టీని, ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుని ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబుని సమర్థిస్తూ ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందట. చంద్రబాబు, బాలకృష్ణలే తనకు నిజమైన వారసులు అన్నట్టుగా ఎన్టీఆర్ చెప్పినట్టుగా చూపిస్తారని తెలుస్తోంది. అసలు నిజాలన్నీ పూర్తిగా తెలిసి ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ బాలయ్య వెర్షన్‌ని ఎంతవరకూ ఒప్పుకుంటారో చూడాలి మరి.

ఎన్టీఆర్ ఓడిపోయాక….నందమూరి కుటుంబ సభ్యులందరూ వెలేశాక…..ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్…..అధికారం కూడా లేని ఎన్టీఆర్ తనకు సేవలు చేయడం కోసం లక్ష్మీపార్వతిని చేరదీశాడు. ఆ విషయాన్ని 1994ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆరే స్వయంగా చెప్పాడు. ఆ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిలు కలిసే చేశారు. ఎన్నికల సమయంలో లక్ష్మీపార్వతి కూడా బాగానే కష్టపడింది. ఆ సీన్‌లో చంద్రబాబు నాయకుడి పాత్ర ఏమీలేదు. అయితే అధికారం వచ్చాక మాత్రం వెన్నుపోటు రాజకీయంతో ఆ అధికాారాన్ని లాక్కోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ జీవితంలో చంద్రబాబే పెద్ద విలన్ అని స్వయంగా ఎన్టీఆరే చెప్తూ దశమగ్రహం పేరుతో ఏకంగా గంటల తరబడి చంద్రబాబు మనిషే కాదు…రాక్షసుడు అన్న స్థాయిలో విమర్శలు చేశాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో మాత్రం చంద్రబాబు హీరో అవుతున్నాడు. లక్ష్మీపార్వతిని విలన్‌గా చూపించబోతున్నారు. ఏం రాజకీయం బాసు……….అని అనిపిస్తోందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -