Tuesday, May 14, 2024
- Advertisement -

‘దేవ‌దాస్’ మూవీ రివ్యూ

- Advertisement -

శ్రీరామ్ ఆదిత్య తెలుగు ఇండ‌స్ట్రీ యంగ్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌డిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తీసింది రెండు సినిమాలు అయిన‌ప్ప‌టికి ,ఆ రెండు సినిమాల‌ను డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించి విజ‌యం సాధించాడు.భ‌లే మంచి రోజు,శ‌మ‌తంక‌మ‌ణి సినిమాల‌తో తాను ఏంటో నిరుపించుకున్నాడు.తాజాగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దేవ‌దాస్ సినిమా ఈ రోజే(గురువారం) ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జున‌,న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌టించారు.ర‌ష్మిక‌,ఆకాంక్ష ఇద్ద‌రు అంద‌మైన హీరోయిన్లు ఈ సినిమాలో న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌ల అయిర టీజ‌ర్‌,ట్రైల‌ర్ బాగుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి.మ‌రి ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య‌కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది లేదో స‌మీక్ష ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

క‌థ
సాధార‌ణ డాక్ట‌ర్‌కు ఓ మాఫియా డాన్‌కు మధ్య జర‌గే క‌థే దేవదాస్‌.శరత్ కుమార్ అండ్ దేవ క్రిమినల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. హాస్పిటల్ లో ఇక ఇన్నోసెంట్ డాక్టర్ దాస్ గా నాని పరిచాయమవుతాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఒక మానసిక వైద్యుడుగా అదే హాస్పిటల్ లో పనిచేస్తుంటాడు. శరత్ కుమార్ (దాదా) మర్డర్ తో సినిమా ఊహించని విదంగా మలుపు తిరుగుతుంది. నాగార్జునని చిన్నప్పటి నుంచి దాదానే పెంచి పెద్ద చేస్తాడు. అయితే గణేష్ సాంగ్ అనంతరం నాగ్ ఒక వ్యక్తిని చంపేస్తాడు. అయితే దేవ బుల్లెట్ షాట్ తో తీవ్రంగా గాయపడగా దాస్ పోలీసులుకు సమాచారం ఇవ్వకుండా అతనికి వైద్యం అందిస్తాడు.

దీంతో దాస్ ని దేవ్ కి ఇంప్రెస్ అయ్యి అతన్నీ తన పర్సనల్ MD (మాఫియా డాక్టర్) గా అపాయింట్ చేసుకుంటాడు. అప్పుడు నాని దాస్ ఆధీనంలో చిక్కుకుంటాడు. అనంతరం నాని నాగ్ మంచి మిత్రులుగా మారతారు. అతన్ని ఎలాగైనా మార్చాలని నాని ప్లాన్ చేస్తుంటాడు. దేవ దృష్టిని లవ్ పై మళ్లిస్తాడు. జాహ్నవి (ఆకాంక్ష) అనే అమ్మాయిని దేవ లవ్ చేస్తుంటాడు. దాస్ కూడ ముందుగానే పూజ (రష్మీక) అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. దేవ దాస్ మధ్య పరిణామాలు అన్ని కామెడీగా సాగుతుంటాయి. ఇక కొన్ని పరిణామాల తరువాత ఫ్రీ క్లైమాక్స్ లో దేవ దాస్ విడిపోతారు.విలన్ నాగ్‌ని చంపాలని టార్గెట్ చేస్తుంటారు. నాగ్ నాని మధ్య అప్పుడు కొన్ని ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. చివరగా విలన్స్ ప్లాన్స్ వలన నాగ్ నాని పాత్రలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాయి అని సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేష‌ణ‌
సినిమా మొత్తం కామెడీతో నింపేశాడు ద‌ర్శ‌కుడు. ఫస్ట్ హాఫ్ కంటే సెకంఫ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా సినిమా పరవాలేదు అనిపించే విధంగా ఉందని టాక్ వస్తోంది. బి సెంటర్స్ లో ఆదరణ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.శ్రీరామ్ ఆదిత్య త‌న మొద‌టి సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమా తీయ‌డంలో కాస్తా త‌డ‌బ‌డిన‌ట్లుగా క‌నిపిస్తుంది.మొత్తనికి సినిమాలో ఏదో మిస్ అయిన‌ట్లుగా అనిపిస్తుంది.నాని,నాగ్ న‌ట‌న‌తో అది పెద్ద‌గా క‌నిపించ‌దు.

న‌టీన‌టుల ఫ‌ర్మామెన్స్‌
దేవదాస్‌గా నాగ్ ,నాని త‌మ న‌ట‌న‌తో ఆ పాత్ర‌ల‌కు ప్రాణం పోశారు.తెర మీద నాగ్ చాలా అందంగా క‌నిపించాడు.నాని క‌న్నా నాగ్ సినిమాలో చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించి,తాను ఇప్ప‌టికి మ‌న్మ‌ధుడేన‌ని నిరుపించుకున్నారు.వెన్నెల కిషోర్ కామెడీ నామమాత్రంగా ఉంది. హీరోయిన్లుకు సినిమాలో పెద్ద‌గా న‌టించ‌డానికి స్కోప్ లేదు.నాగ్ నాని త‌ప్ప మిగిలిన పాత్ర‌లు పెద్ద‌గా హైలెట్ కావు.

సాంకేతిక వ‌ర్గ ప‌నితీరు
మ‌ణిశ‌ర్మ త‌న సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో సినిమా భారీ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది.

బోటమ్ లైన్‌
దాస్‌ను గ‌ట్టు ఎక్కించిన దేవ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -