Saturday, May 4, 2024
- Advertisement -

ప‌వ‌న్ చాలా చిన్న హీరో

- Advertisement -

పవన్ కన్నా విజయే పెద్ద స్టారా? అవున‌నే అంటున్నాయి.యూట్యుబ్ రికార్డ్స్‌.యూట్యూబ్‌లో ఏంచేసిన సంచ‌ల‌న‌మే.మ‌న తెలుగు హీరోల‌లో ప‌వ‌న్‌-మ‌హేష్ పెద్ద హీరోలుగా ఉన్నారు.వీరు సాధించిన రికార్డ్స్ అందుకు సాక్ష్యం.తెలుగులో వీరిద్దిరి మ‌ధ్యే ప్రాధాన పోటీ.వీరి సినిమా మొద‌లు నుంచి టీజ‌ర్‌,ట్రైల‌ర్‌,క‌లెక్ష‌న్స్ అన్ని లెక్క‌లు వెసుకుంటారు ఫ్యాన్స్‌.అదే సౌత్‌కి వ‌చ్చేస‌రికి ర‌జిని త‌రువాతే ఎవ్వ‌రైనా.అలాంటి పరిస్థితి నుంచి బ‌య‌ట‌కి తీసుకువచ్చాడు తలైవా విజ‌య్‌. విజ‌య్‌కి త‌మిళ‌నాడులో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇంకా చేప్పాలంటే సౌత్‌లోనే మ‌న‌వాడిన మించిన‌వాడు లేడ‌నే చేప్పాలి.

మొన్న సాయంత్రం రిలీజైన ‘అజ్ఞాతవాసి’ టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపింది. అప్పటిదాకా ఉన్న టీజర్ వ్యూస్, లైక్స్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. కేవలం 30 నిమిషాల్లోనే 10 లక్షల వ్యూస్ సాధించిన ఈ టీజర్.. 80 నిమిషాల్లోనే 2 లక్షల లైక్స్‌తో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. 24 గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌ను ఏకంగా 64 లక్షల మంది చూడటం విశేషం. లైక్స్ 4.12 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా తెలుగులో ఏ టీజర్‌కూ ఫుల్ టైంలో కూడా ఇన్ని లైక్స్ లేవు. 24 గంటల్లో వ్యూస్ రికార్డును భారీ తేడాతో దాటేసింది ఈ టీజర్. ‘అజ్ఞాతవాసి’ టీజర్ వస్తే రికార్డుల మోత మోగించాలని పవన్ ఫ్యాన్స్ ముందు నుంచే కాచుకుని కూర్చోవడం దానికి సబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌‌తో ముందే అభిమానుల్ని అలర్ట్ చేయడంతో రికార్డుల మోత మోగింది.ఐతే తెలుగు వరకు చూసుకుంటే ‘అజ్ఞాతవాసి’ టీజర్ తిరుగులేని రికార్డులు నమోదు చేసింది కానీ.. మొత్తంగా సౌత్ ఇండియాలో ఇది రికార్డు సాధించలేకపోయింది. 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా విజయ్ సినిమా ‘మెర్శల్’ పేరిట ఉన్న రికార్డుకు ‘అజ్ఞాతవాసి’ చాలా దూరంలో ఆగిపోయింది.

విజయ్ సినిమా టీజర్‌ను ఒక్క రోజు వ్యవధిలో ఏకంగా 1.12 కోట్ల మంది చూడటం విశేషం. ఐతే రెండో స్థానంలో ఉన్న అజిత్ టీజర్ ‘వివేగం’ను మాత్రం ‘అజ్ఞాతవాసి’ దాటేసింది. వివేగం టీజర్‌కు 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే సౌత్ ఇండియాలో పవన్ కంటే విజయ్ పెద్ద హీరో అనుకోవాలా.. సోషల్ మీడియా వ్యూస్ విషయంలో విజయ్ ఫ్యాన్స్‌కు ఉన్నంత అప్రమత్తత మనోళ్లకు లేదని భావించాలా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -