Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ సినిమా శ్రీమంతుడు కంటే ఎక్కువ రోజులు ఆడింది

- Advertisement -

మలయాళ సినిమా ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా జనాలు కూడా పడి చచ్చిన సినిమా – ‘ ప్రేమం ‘. ఈ సినిమా విషయంలో అందరికీ మంచి ఫీల్ వచ్చింది ఎంతగా అంటే ఈ సినిమా ఇప్పుడు తెలుగు లో రీమేక్ అవుతున్నా కూడా మలయాళం వెర్షన్ మీదనే అందరి కన్నూ ఉంది.

2015 లో  మన టాలీవుడ్ ని తీసుకుంటే ఇక్కడ శ్రీమంతుడు సినిమా 150 రోజులు ఆడింది, అదొక రికార్డు కానీ ప్రేమం సినిమా మలయాళం లో 200 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ప్రేమమ్ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులకన్నా ఎదో రకంగా విన్నవాళ్లే ఎక్కువ. ప్రస్తుతం నాగాచైతన్య మజ్ను పేరుతో రీమేక్ చేస్తున్న ఈ సినిమా మే 29 న మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదల అయ్యి కొత్త చరిత్రను సృష్టించింది.

ఇక్కడ విచిత్రం ఏంటంటే పెద్దగా డబ్బింగ్ సినిమాలను ఆదరించని తమిళులు కూడా ప్రేమమ్ ఒరిజినల్ మలయాళ వర్షన్ ని చెన్నైలోని మల్టిప్లెక్సుల్లో ఎంతలా విరగబడి చూశారంటే సినిమా విడుదల అయ్యి నేటికి 225 రోజులు అవుతున్నా ఈవినింగ్ షోలకు 70% ఆక్యుపెన్సీ ఉంటుంది. దాంతో 2015 లో ఎక్కువరోజులు ఆడిన సినిమాగా ప్రేమమ్ రేర్ రికార్డును సొంతం చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -