Tuesday, May 14, 2024
- Advertisement -

న్యూస్ చానెళ్ల‌ను బ్యాన్ చేయాల‌నే ఆలోచ‌న‌లో టాలీవుడ్?

- Advertisement -

టాలీవుడ్ తాజా సంక్షోభంపై నిన్న‌(మంగ‌ళ‌వారం) తెలుగు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు హీరోలు అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు, కొందరు ప్రముఖులపై ఆరోపణలు, నిరసనల వంటి అంశాలతో చెలరేగిన వివాదంపై చర్చించేందుకు సినీ పెద్దలు మంగళవారం సమావేశమయ్యారు. సీనియ‌ర్ హీరో చిరంజీవి ఈ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ముఖ్యంగా ఈ స‌మాశేవంలో టీవీ చానెళ్లు సినిమా వాళ్ల మీద చేస్తున్న కామెంట్ల‌పై వారు చ‌ర్చించుకున్నార‌ని స‌మాచారం.ప‌లు టీవీ చానెళ్లు సినిమాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని, వాటికి కంటెంట్ ఇవ్వకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, వాటిని ప్రోత్సహించకూడదని ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది.

అస‌లు ఇండ‌స్ట్ర్రీ టీవీ చానెళ్లును బ్యాన్ చేయాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన పెద్ద హీరోల సినిమాల రీలిజ్ టైంలో ప‌బ్లిసిటి కోసం టీవీ చానెళ్లు స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని భావించి ఈ ప్రతిపాద‌న‌పై వెన‌క్కి త‌గ్గారు.శ్రీరెడ్డి వ్య‌వ‌హారం  కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.శ్రీరెడ్డిని మొద‌ట్లోనే పిలిచి మాట్లాడి ఉంటే ఇంత వ‌ర‌కు వచ్చేది కాద‌ని వారు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తుంది.కో-అర్డినేటర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయ‌ల‌ని ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.కాస్టింగ్ కౌచ్ గురించి ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

మరో మూడు, నాలుగు రోజుల్లో మరోసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.ఈ స‌మావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎవ‌రు హ‌జ‌రు కాలేద‌ని సమాచారం.హీరోలు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్, రాంచరణ్, రామ్, నాని, సాయి ధరమ్ తేజ, వరణ్ తేజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కెఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, జీవిత, రాజశేఖర్, మంచు లక్ష్మి, బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -